మహిళలకు మేలు చేసిన వ్యక్తి జగన్: సజ్జల
AP: మహిళలకు మేలు చేసిన వ్యక్తి జగన్ అని.. ఐదేళ్లలోనే యాబై ఏళ్ల సంస్కరణలు తెచ్చారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మండల, గ్రామస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలని, అప్పుడు క్షేత్రస్థాయిలో మహిళా విభాగం మరింత పటిష్టంగా మారుతుందన్నారు. చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారని ఆరోపించారు.