'జిల్లా కేంద్రంలో కబ్జా భూములను కాపాడాలి'

NRML: జిల్లా కేంద్రంలో కబ్జాకు గురైన భూములను కాపాడాలని, కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని శుక్రవారం ఆర్డీవో రత్న కళ్యాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో కబ్జాకు గురైన భూముల సర్వే నంబర్లతో సహా ఆర్డీవోకు వివరించామన్నారు.