మదనపల్లె రెండవ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రాజారెడ్డి

మదనపల్లె రెండవ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రాజారెడ్డి

అన్నమయ్య: మదనపల్లె రెండవ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రాజారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ పనిచేస్తున్న సిఐ రామచంద్ర బదిలీపై వెళ్లారు. ఇన్‌స్పెక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అనంతరం ప్రజల కూడా తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలని కోరారు.