ALERT: భాగ్యనగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ALERT: భాగ్యనగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

TG: నగర ప్రజలకు ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు. మిలాద్‌-ఉన్‌-నబీ ఊరేగింపు సందర్భంగా ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పాతబస్తీలోని చార్మినార్‌తోపాటు పర్యాటక ప్రదేశాలను మూసివేయనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి వెల్లడించారు.