మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తులు

KMM: జాతీయ ఆరోగ్య మిషన్ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిపై నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు DMHO బి.కళావతిబాయి తెలిపారు. మల్టీ జోన్ -1లో MBBS పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నాక దరఖాస్తు పత్రం, సర్టిఫికెట్ల జిరాక్స్‌లను తమ కార్యాలయంలో ఈనెల 26నుంచి 30లోపు సమర్పించాలని సూచించారు.