ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
BPT: వేటపాలెంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్‌లో శనివారం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాలకు బహుకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బారావుతో పాటు సభ్యులు పాల్గొని ఉపాధ్యాయ బృందానికి కుర్చీలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ కృషి ఉంటుందని పట్టభద్రుల సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బారావు తెలిపారు.