గ్రామాల మధ్యన నిలిచిన రాకపోకలు
JGL: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి ఫకీర్ కొండాపూర్, యామాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డాం వద్ద హై లెవల్ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా, వాహనాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక దారిపై వరద ఉధృతంగా ప్రవహించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ఫకీర్ కొండాపూర్ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.