VIDEO: 'చెత్తను తొలగించండి'
నూజివీడులోగల అమ్మవారి తోటలో డ్రైనేజీలు పూడుకుపోయి ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో 12, 13వ వార్డు కలిసే ప్రదేశంలో ప్రధానంగా ఉన్న రెండు డ్రైనేజీల వద్ద చెత్త కుప్పలుగా పేరుకుపోయిందని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదన్నారు. చెత్తను తొలగించాలన్నారు.