ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణాపాయం

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణాపాయం

VSP: విశాఖపట్నం నుంచి జయపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పార్వతీపురం పాచిపెంట మండలంలోని రొడ్డవలస వద్ద చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, ప్రయాణికులను సమయానికి దింపడంతో పెనూ ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.