'విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందాలి'
MLG: ములుగు జాకారంలో జరిగిన ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందాలని అన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాలంటీర్లు డ్రాప్‌ఔట్ విద్యార్థుల గుర్తింపు సర్వే నిర్వహించారు. ప్లాస్టిక్ నిర్మూలన, మొక్కల నాటడం, ఓటరు అవగాహన వంటి కార్యక్రమాలు చేపట్టారు.