VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గంగుల
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, మౌలిక వసతులు కల్పించాలన్నారు.