అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి
కృష్ణా: మచిలీపట్నంలో జిల్లా మండలి సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ,ఎ మ్మెల్యేలు పాల్గొన్నారు.