కింది తండ గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

కింది తండ గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

SRPT: మఠంపల్లి మండల పరిధిలోని కింది తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారురాలు మాలోతు జ్యోతి శ్రీను నాయక్ గెలుపొందారు. బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆమె 420 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కింది తండాలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో పార్టీ శ్రేణులు, మద్దతుదారులు బాణసంచా కాల్చి, సంబరాలు చేసుకున్నారు.