అతడు దేశం గర్వపడేలా చేస్తాడు: మోర్కెల్
సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపికైన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ ఒక నాణ్యమైన బ్యాటర్ అని మోర్కెల్ కొనియాడాడు. అతడికి తుది జట్టులో ఆడే అవకాశం లభిస్తే, దేశం గర్వపడేలా అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కాగా, తొలి వన్డే ఈనెల 30న ప్రారంభం కానుంది.