విద్యుత్ షాక్‌తో 4ఏళ్ల బాలుడు మృతి

విద్యుత్ షాక్‌తో 4ఏళ్ల బాలుడు మృతి

విజయనగరం: శృంగవరపుకోట మండలం మరిపిల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని 4ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు. రామశాల శ్యామ్ అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ విద్యుత్ స్తంభాన్ని తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హుటాహుటిన చిన్నారిని శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు.