కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరి మండలంలోని తాళ్లూరు రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కందుల నాణ్యతను ఆయన పరిశీలించారు. కందుల కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం మద్దతు ధర కింటాకు రూ.7,500లు ఇస్తున్నందున, రైతులు సద్వినియోగం చేసుకొని కందులను విక్రయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.