VIDEO: అద్వానంగా ఎనుమాముల మార్కెట్ రోడ్డు
WGL: ఎనుమాముల మార్కెట్ నుంచి దేశాయిపేట వైపు వెళ్లే రహదారి అద్వానంగా మారింది. ఈ రహదారిలో అనేక గుంతలు ఏర్పడి, కంకర పైకితేలి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ దారి గుండా మార్కెట్‌కు వస్తుంటాయని, కొన్నేళ్లుగా రోడ్డు ఇలానే ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.