VIDEO: పుంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మకు విశేష పూజలు
CTR: పుంగనూరులోని బెస్తవీధిలోగల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనెతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మహా మంగళహారతులు సమర్పించారు.