VIDEO: పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
కోనసీమ: విజన్ 2047 ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలను తొలగించి, ప్రతి కుటుంబాన్ని సంపన్నంగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యం అని అన్నారు.