చెట్లను కాపాడటం మనందరి బాధ్యత: ఎస్పీ
KMR: ప్రపంచ అటవీ దినోత్సవం (మార్చి 21) సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాణవాయువునిచ్చే చెట్లు లేకపోతే ఏ జీవి నిలబడలేదని, అడవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.