LIC Q2 ఫలితాలు.. లాభం రూ.10,053 కోట్లు

LIC Q2 ఫలితాలు.. లాభం రూ.10,053 కోట్లు

ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,053 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.7,621 కోట్లుగా ఉంది. నికర లాభంలో 32 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. మొత్తం ఆదాయం గతేడాదితో పోలిస్తే రూ.2,29,620 కోట్ల నుంచి రూ.2,39,614 కోట్లకు పెరిగింది.