యలమంచిలిలో నేటి నుంచి నీటి సరఫరా.!
AKP: యలమంచిలి మున్సిపాలిటీకి ప్రధాన నీటి వనరైన సోముదేవపల్లి-ఎర్రవరం ఆర్‌డబ్ల్యూఎస్ పంపింగ్ లైన్‌లో ఎయిర్ వాల్వ్ లీకేజీ సమస్యను అధికారులు పరిష్కరించారు. దీంతో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచే నీటి పంపింగ్ ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి పట్టణంలో సాధారణంగా నీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలన్ని కోరారు.