ఇన్సూరెన్స్ కంపెనీ మోసం.. బాధితుల ధర్నా
KMM: ఖమ్మంలో నకిలీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేసి లక్షల రూపాయలు లూటీ చేశారంటూ శుక్రవారం బాధితులు ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అమాయక ప్రజల దగ్గర డబ్బులు లూటీ చేసిన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. తమను ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.