పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ADB: జిల్లా కేంద్రంలోని బాలక్ మందిర్ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి, వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.