హమ్మయ్య.. దాహం తీరింది..!

VZM: వేసవిని దృష్టిలో ఉంచుకొని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు రాజాం మున్సిపాలిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనర్ రామప్పలనాయుడు ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలని కమిషనర్ అన్నారు. వేసవిలో మూగజీవాలు తాగునీటికి ఇబ్బందులు పడకూడదనే యోచనతో తొట్టెలు పెట్టినట్లు పేర్కొన్నారు.