పాఠశాలలో బెట్టింగ్ యాప్‌లపై అవగాహన

CTR: బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి గేమ్స్ ఆడితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. స్థానిక బాయ్స్ గవర్నమెంట్ హై స్కూల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ వ్యసనంలా మారి జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పారు.