ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ
KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. స్లాబ్ పూర్తి స్థాయిలో అయిన వారికి ఉగాదిలోగా గృహ ప్రవేశం చేయాలని సూచించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులందరూ నిర్మాణాలను కొనసాగించాలని అన్నారు.