పాక్‌కు అలవాటే: కేంద్రం

పాక్‌కు అలవాటే: కేంద్రం

ఆఫ్ఘన్‌తో ఇటీవల ఘర్షణకు భారత్ కారణమంటూ పాక్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఇవి నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు వేయడం పాక్‌కు పరిపాటిగా మారిందని మండిపడింది. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశ మాటలకు విశ్వసనీయలేత లేదని చురకలంటించింది.