మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని
AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించిందని తెలిపారు. అయితే తాము గ్రామ సభల ద్వారా భూ సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు.