నిన్న మరమ్మతులు.. నేడు లీకేజీ.!
MDK: చిలిపిచెడ్ మండలం అజ్జమర్రీ, బండాపోతుగల్, ఫైజాబాద్ గ్రామాలకు గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని స్థానికులు తెలిపారు. ఆదివారం మరమ్మతులు చేసినప్పటికీ, సోమవారం తెల్లవారుజాముకే పైప్‌లైన్ మళ్లీ పాడై నీరు వృథా అవుతోందన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు మిషన్ భగీరథ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.