నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MNCL: కోటపల్లిలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు బాలకృష్ణ, వెంకటేశ్వర్లు తెలిపారు. 33KV ఫీడర్ లైన్ పనుల నిమిత్తం నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కోటపల్లి, దేవులవాడ, ఆల్గాం సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు పవర్ కట్ చేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.