'పల్లె దవాఖానాను ఏర్పాటు చేయాలి'

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో పల్లె దవాఖాన కావాలని గురువారం గ్రామ ప్రజలు కోరారు. ఉమ్మడి కవ్వాల్ గ్రామపంచాయతీలో సుమారు 3600 జనాభా ఉన్నారని వారు తెలిపారు. సబ్ సెంటర్ కామన్ పల్లిలో ఉండడంతో డయాబెటిస్, బిపి పేషెంట్లు, వృద్ధులు అంత దూరం వెళ్లి మెడిసిన్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి పల్లె దవాఖానాను ఏర్పాటు చేయాలన్నారు.