నీటి సంపులో పడి.. చిన్నారి మృతి

నీటి సంపులో పడి.. చిన్నారి మృతి

MBNR: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రమేశ్, జ్యోతి దంపతుల కూతురు నిహస్సి(4) ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. కాసేపటికి తల్లి చూడగా సంపులో చిన్నారి పడి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.