షాదీఖానా సమస్యలపై ఎమ్మెల్యే మాధవి పరిశీలన

షాదీఖానా సమస్యలపై ఎమ్మెల్యే మాధవి పరిశీలన

GNTR: గుంటూరులోని పట్టాభిపురం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ షాదీఖానాను ఎమ్మెల్యే మాధవి సందర్శించారు. షాదీఖానాలో నెలకొన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, షాదీఖానా వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆమె గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా, షాదీఖానా పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని వినియోగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలన్నారు.