గాజువాకలో రెండు లారీలు ఢీ
VSP: గాజువాక పరిధిలోని లంకెలపాలెం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాన జంక్షన్లో రెండు లారీలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.