ఈనెల 24న బోథ్ మండలానికి మంత్రి రాక

ఈనెల 24న బోథ్ మండలానికి మంత్రి రాక

ADB: బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్‌కు సోమవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే బజార్‌హత్నూర్ మండల కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరు కానున్నట్లు ఇరు వర్గాలు తెలిపాయి. కావున లబ్దిదారులు సకాలంలో హాజరై చెక్కులు పొందాలని కోరారు.