ఈనెల 26న అచ్చంపేటకు రానున్న గవర్నర్

ఈనెల 26న అచ్చంపేటకు రానున్న గవర్నర్

NGKL: ఈనెల 26వ తేదీన అచ్చంపేట పట్టణానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రానున్నారు. అచ్చంపేట పట్టణంలో చెంచు గిరిజనుల ఉచిత సామూహిక వివాహాల వేడుకకు ఆయన హాజరుకానున్నట్టు వనవాసి కళ్యాణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాట్రాజు వెంకటయ్య ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమల ప్రాంతానికి చెందిన 111 చెంచు జంటలకు వివాహం జరిపించనున్నామని ఆయన వెల్లడించారు.