ఆచంపల్లిలో గడ్డవాములు దగ్ధం
NZB: బోధన్ పట్టణం ఆచంపల్లిలో గల ఇందూర్ మోడల్ స్కూల్ వద్ద కాలనీలో ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఎలాంటి ప్రాణాష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.