ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
WGL: రాయపర్తి (M)లోని ఒక పెట్రోల్ బంకు వద్ద ఆదివారం వాహనాల రద్దీ పెరిగింది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు ముందస్తుగా డీజిల్ కోసం బంకు ముందు క్యూ లైన్లలో వేచి ఉన్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంతమంది కిరాణా దుకాణదారులు పెట్రోల్, డీజిల్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారు.