రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
KRNL: కోడుమూరు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు (36) మృతి చెందాడు. వ్యక్తిగత పనిపై వెంకటగిరి వెళ్లి వస్తున్న శ్రీనివాసులు, కోడుమూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్న బోయ గిరి ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరూ గాయపడగా, కర్నూలుకు తరలిస్తుండగా శ్రీనివాసులు మార్గమధ్యంలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.