VRA సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నిరసన

VRA సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నిరసన

NDL: VRA సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఏఐసీసీటీయూ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం గ్రామ సేవకుల సంఘం ఆధ్వర్యంలో నంది కోట్కూరు తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. VRAలకు పేఆఫ్ స్కేల్ అమలు చేసి, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు.