జవాన్ మురళి నాయక్‌కు ఘన నివాళులు

కడప: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి వైసీపీ ముద్దనూరు మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం వైసీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన వీరజవాన్ ప్రదర్శించిన ధైర్య సాహసం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.