కందుకూరులో నూతన సర్పంచు ప్రమాణ స్వీకారం
RR: కందుకూరు మండలంలోనీ పలు గ్రామాల్లో నూతన పంచాయతీ మండళ్లు ఏర్పాటు అయ్యాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దాసర్లపల్లి, నేదునూర్, గూడూరు, కొత్తగూడ, కటికపల్లి, అన్నోజిగూడ, బెగరికంచ, దెబ్బడగూడ, కందుకూరు, పులిమామిడి తదితర గ్రామాల్లో నూతన పాలక వర్గం ఏర్పాటైంది.