సీఎం రేవంత్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: జగదీశ్ రెడ్డి
SRPT: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఇవాళ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతే రేవంత్ పదవి పోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.