భారీ వర్షాలు.. అధ్వానంగా రోడ్లు

CTR: జిల్లాలో ఇటీవల వరుసగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రధాన మార్గాలతో పాటు గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరి బురదమయంగా మారడంతో రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. పై ఫొటో పుంగనూరు - శంకర్రాయలపేట రోడ్డు దుస్థితిని తెలియజేస్తోంది. అధికారులు తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.