లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతిచెందిన బాలుడి వివరాలు ఇవే..!

లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతిచెందిన బాలుడి వివరాలు ఇవే..!

HYD: ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్‌మెంట్స్ జీ బ్లాక్ వద్ద లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడు అదే అపార్ట్‌మెంట్‌లో అయిదో అంతస్తులో నివాసం ఉంటున్న నరుసు నాయుడు చిన్న కుమారుడు హర్షవర్థన్ (5)గా గుర్తించారు. మధురానగర్‌లోని శ్రీనిధి పాఠశాలలో LKG చదువుతున్నాడు. తల్లి, సోదరుడితో పాటు ఇంటికి వచ్చే సమయంలో ఈ ఘటన జరిగింది.