అవుకులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

NDL: అవుకు మండల కేంద్రంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం నాడు పర్యటించారు. వైసీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన తెలిపారు.