'4 బోట్లలో విహారయాత్రకు పర్యాటకులు'

E.G: దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు శుక్రవారం పర్యాటకులు వెళ్లారని టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం నాలుగు పర్యాటక బోట్లలో 165 మంది పర్యాటకులు గోదావరి నదిలో విహారయాత్రకు వెళ్లినట్లు పేర్కొన్నారు. పర్యాటకులందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చామని, సాయంత్రం ఐదు గంటలలోపు బోట్లు తిరిగి వస్తాయని స్పష్టం చేశారు.