సంక్షేమ శాఖలు 99 రోజుల లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్
WGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు క్రీడలతో పాటు వ్యాసరచన, ఇతర పోటీలు నిర్వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.