మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: సీపీ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: సీపీ

పెద్దపల్లి: మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందిస్తామని అన్నారు. వేధింపులు జరిగితే వెంటనే రక్షణ కోసం షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఫిర్యాదుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.